తోరం చేయు విధానము
తెల్లని దారం మీ చేతికి కట్టుకునేందుకు సరిపోను పొడవుగా సుమారు 30 సెం. మీ 9 వరుసలు తీసుకుని పసుపు పూయండి. తొమ్మిది చోట్ల పువ్వులతో కాని ఆకుల తో కాని ముడులు వేసిన తోరములను అమ్మవారి ముందు ఒక పళ్ళెములో పెట్టి పసుపు,కుంకుమ,అక్షంఅతలతో ఈ క్రింది విధంగా పూజించవలెను
- కమలాయై నమః ప్రధమగ్రoధిం పూజయామి॥
- రమాయై నమః ద్వితీయగ్రoధిం పూజయామి॥
- లోకమాత్రేనమః తృతీయగ్రoధిం పూజయామి॥
- సర్వజననై నమః చతుర్ధగ్రoధిం పూజయామి॥
- మహాలక్ష్మైనమః పంచమగ్రoధిం పూజయామి॥
- క్షీరాబ్ధి తనయాయై నమః షష్ఠగ్రoధిం పూజయామి॥
- విరూపాక్షిణియ్యే నమః సప్తమగ్రoధిం పూజయామి॥
- చంద్ర సోదరై నమః అష్టమగ్రoధిం పూజయామి॥
- హరివల్లభాయై నమః నవమగ్రoధింపూజయామి॥
వాయన దానం(వాయన విధి)
పళ్ళెములో తాంబూలము(తమలపాకులు,వక్క),పండ్లు,పువ్వులు, నాణెం , రవిక గుడ్డ(శక్తీ కొలది చీర) దానిపై ముడులు వేసిన తోరమును వుంచి, 9 పూర్ణం భూరెలు,పిండి తో చేసిన ధీపపు ప్రమిద లో ఆవు నెయ్యి, వత్తి వేసి వెలిగించి ముందుగా వరలక్ష్మీ దేవికి వాయనము ఇచ్చి అక్షింతలు అమ్మవారి పాదాలపైన ఉంచవలెను.
మీ కుడిచేతితో చీర కొంగుని ,నీళ్ళ గ్లాస్ ని మరియు వాయనం పళ్ళెం పట్టుకుని ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి వాయనం ఇవ్వండి.
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మిమ్ స్వశక్తితం దాతవ్యం ద్వాదశా పూ పం వాయనం హి ద్విజాయతయే॥
(గమనిక: అమ్మవారికి ఇచ్చిన వాయనం లో తోరం మీ కుడి చేతికి కట్టుకుని, అందులో పెట్టిన జ్యోతిని తినవలెను. పూర్ణం భూరేలు మీరు కాని, మీ కుటుమ్భీకులు కాని పూజ ముగిసిన తరువాత తినవోచ్చును)
తోరబంధన మంత్రం
తోరము కట్టుకునేప్పుడు క్రింది విధంగా చదవ వలెనుబధన్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రధం పుత్రపౌత్రాభివృధిం చ మమసౌఖ్యం దేహిమే రమే॥ఈ మంత్రాన్ని చదువుతూ తోరణము కట్టుకునవలెను.
అమ్మవారికి ఇచ్చిన పళ్లెం లో తోరము ని తీసి మీరు కట్టుకొని తరువాత ముత్తైదువునకు వాయనము ఇవ్వండి.
అదే విధంగా అమర్చిన ఇంకొక పళ్ళెమును ఒక ముత్తైదువునకు వాయనము ఇచ్చి , వారి చేత అక్షింతలు వేన్చుకుని కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోండి .
ముత్తైదువునకు వాయనము ఇస్తూ ఇలా చెప్పవొచ్చును
- మీరు: ఇందవమ్మ వాయనం॥
- ముతైదువ:తేవమ్మ వాయనం ॥
- మీరు: ఇస్తినమ్మ వాయనం ॥
- ముతైదువ: పుచ్చుకుంటి నమ్మ వాయనం॥
- మీరు: ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం ॥
- ముతైదువ: ముమ్మాటికి ముట్టిన్ధమ్మ వాయనం॥
- మీరు: వాయనం పుచ్చుకున్న వనితెవరమ్మ ॥
- ముతైదువ: వరలక్ష్మి దేవి నేనేనమ్మ ॥
పునః పూజ:శ్లోకo
పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షంతలు దేవిపై చల్లుతూ ఈ క్రింద మంత్రమును చదువుకొనవలెనుఓం శ్రీవరలక్ష్మీ దేవ్యైనమః పునఃపూజాంచ కరిష్యే
- ఛత్రం ఆఛ్చాదయామి
- చామరం వీజయామి
- నృత్యం దర్శయామి
- గీతంశ్రావయామి
- సమస్తరాజోపచార
- శక్యోపచార
- భక్త్యోపచార పూజాంసమర్పయామి
ఉద్వాసన
ఏతత్ఫలం శ్రీవరలక్ష్మీ మాతార్పణమస్తు,అంటు అక్షంతలు నీటితోపాటు ఒక ఆకు పైన వదలవలెను.శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామీ అనుకొని అమ్మవారిని పూజించిన అక్షంతలు తీసుకొని చిన్నవారి తల పైన వెయ్యండి. పెద్దవారు తమతమ తలలపై వేసుకొనవలెను.కలశం మరియు పసుపుగణపతి వున్నఆకుని మూడు సార్లు పైకి ఎత్తి తిరిగి క్రిందవుంచి,పసుపు గణపతిని తీసి దేవునిపీటముపై నుంచవలెను దీనిని ఉద్వాసనం చెప్పటం అంటారు.
పూజా విధానమును ఒక్కొక్కరు ఒక్కోలా ఆచరిస్తాము. మనము చేసిన పూజ లో లోపాలు ఉన్నా,మంత్రాలు చదవటం లో లేదా పలుకటం లో తప్పులు ఉన్న క్షమించమని ప్రార్ధిస్తూ ఇలా చెప్పుకోండి
శ్లో:యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజాక్రియాది ఘున్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్ర హీనం,క్రియాహీనం,భక్తిహీనం,జనార్ధన,యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే,అనయాధ్యాన ఆవాహనాదిశోడోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః శ్రీవరలక్ష్మీ దేవతా స్సుప్రీతోవరదో భవతు,శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి.
శ్రీ వరలక్ష్మీ దేవి పూజావిధానము సంపూర్ణం
లక్ష్మీరూపు ధరించటం
వరలక్ష్మీ దేవికి అలంకరించిన పసుపు దారం కి కట్టిన లక్ష్మీ కాసు లేదా రూపు ,లేదంటే పసుపు కొమ్ము ని తీసి మీ భర్త తో కట్టించుకుని ఆశీస్సులు తీసుకోండి. అలా కుదరనప్పుడు ముతైదువ తో కాని పెద్దవారితో(అమ్మ, అత్తమ్మ ఇలా ) ఎవరితోనైనా కాని కట్టించుకుని ఆశిస్సులు తీసుకోండి.
వ్రతము పూర్తి అయిన తరువాత ఆరోజు సాయంత్రము మీ వీలునుబట్టి 5,9,11 ముత్తైదువులను పిలిచి పసుపు,కుంకుమ,గంధం,పువ్వులు,తాంబూలము(తమలపాకులు,వక్క,పండ్లు,నానపెట్టిన సెనగలు) ఇచ్చుకోవలెను.
Keep Thoram(a thread with a length of approx. 50cm(to tie around your wrist)9 rows by applying turmeric.Make 9 knots with a flower or a leaf) In front of goddess Lakshmi and do pooja and spell the below slokam
- Kamalaaye Namaha -Pradhama Grandhim Poojayaami
- Ramaaya Namaha -Dvithiya Grandhim Poojayaami
- Lokamaatre Namaha -Truthiya Grandhim Poojayaami
- Sarvajannye Namaha -Chathurdha Grandhim Poojayaami
- Mahalakshmai Namaha -Panchama Grandhim Poojayaami
- Ksheerabdhi tanyaai Namaha -Shashta Grandhim Poojayaami
- Viroopaakshniye Namaha -Sapthama Grandhim Poojayaami
- Chandra Sahodariye Namaha -Ashtama Grandhim Poojayaami
- Harivallabhayi Namaha -Navama Grandhim Poojayaami
No comments:
Post a Comment