శ్రీ మహాగణాధిపతయే నమః
ఆచమనము
ఓం కేశవాయస్వహా,ఓం నారాయణస్వాహా,ఓం మాధవాయస్వాహా అని మూడు సార్లు నీరు చేతిలో పోసుకుని త్రాగవలెనుఓం గోవిందాయ నమః'...అని చేతులు కడుక్కోవాలి.
- ఓం విష్ణవే నమః
- ఓం మధుసూదనాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం హౄషికేశాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం అనిరుద్దాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం జనార్ధనాయ నమః
- ఓం ఉపేంద్రాయ నమః
- ఓం హరయే నమః
- ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అని అక్షింతలు మీ వెనుకకి వేసుకోవాలి)
ప్రాణాయామమ్యః
ఓంభూః - ఓం భువః - ఓం సువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః
ఓగ్ ఒ సత్యం - ఓం తత్ నవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ -ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభే శోభనముహుర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో ర్దక్షణదిగ్భాంగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే
( ఇతర దేశం లో నివసిస్తున్న వారు తాము నివసిస్తున్న దేశం భారత దేశానికీ ఏ దిక్కున వొస్తుందో చూసుకుని అది కలిపి చెప్పుకోవొచ్చు).
శోభనగౄహే(అద్దె ఇల్లు అయినచో ,వసతి గ్రుహే అనియు,సొంత ఇల్లైనచో స్వగౄహే అనియు చెప్పుకొనవలెను)
సమస్తదేవతాభ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర మానేన(జరుగుతున్న తెలుగు సంవత్సరం పేరు)సంవత్సరే, దక్షిణాయనే వర్షఋతుః, శుక్ల పక్షే, శుభతిధౌ, శుక్ర వాసరే శుభ నక్షత్రే, శుభయోగే,శుభ కరణే,ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్(మీగోత్రం)గోత్రస్యశ్రీమత్యః(మీభర్తపేరు)మమ;సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య,వీర్య,విజయ,అభయ,ఆయురారోగ్య,ఐశ్వర్యాభివౄధ్యార్థం,పుత్రపౌత్రాభివౄధ్యార్థం,మమధర్మార్థ,కామమోక్ష,చతుర్విధ,ఫలపురుషార్థం,సర్వ్వాభీష్ట సిధార్థం, అఖండితసర్వవిధసుఖసౌభాగ్య,సంతతి ఆయుఃఆరోగ్య,ఐశ్వార్యాఃఅభి వౄధ్యార్థం, శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే .తద్ధంగ కలశపూజాం కరిష్యే.(నాకు తోచిన రీతిలో,నాకు తోచిన నియమముతో,నాకు తోచిన విధముగా శక్తానుసారముగా,భక్తి,శ్రధలతో,సమర్పించుకొంటున్న పూజ)
కలశ పూజ:
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మౄతాః
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగైచ యమునేచైవ గోదావరి,సరస్వతీ,నర్మదా,సింధు,కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు ఈ శ్లోకాన్ని చదువుకొని ఈ క్రిందవిధగా పూజించాలి.
ఏవం కలశ పూజాం కుర్యాత్ పూజార్థం మమ దురితక్షయకారకాః
కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య(కలశమందలి నీళ్ళు దేవునిపై చల్లాలి.)ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆనీటిని మన తలపై చల్లుకోవాలి.)ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య్(పూజాద్రవ్యములపైకూడాచల్లాలి)కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతోగాని,ఆకుతోగాని చల్లాలి.
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తో పివా యస్స్మరేత్పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్శుచిః
అని తరువాత కొద్దిగ అక్షంతలు,కుంకుమ,పసుపు వరలక్ష్మీదేవిపైవేసి,ఆమెను తాకి నమస్కరించాలి.
గణపతి ప్రార్దన
శుక్లాం భరధరమ్ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోప శాంతయే
పసుపు తో గణపతి ని చేసి ఆకు పైన ఉంచి పూజ చేసి తామ్భులం మరియు పండ్లు పెట్ట వలెను
లక్ష్మీప్రార్థన
పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రితాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ప్రార్ధనా నమస్కారం సమర్పయామి)
లక్ష్మీధ్యానం
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కౄతే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమ: ధ్యానం సమర్పయామి)అని ఆదేవిని మనస్పూర్తిగా ధ్యానించాలి.
లక్ష్మీదేవికి ఆవాహనం
సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే ఆవాహయామిదేవి త్వాం సుప్రీతాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆవాహయామి అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించాలి,నమస్కరించాలి.)
లక్ష్మీదేవికి ఆసనం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభుషితే సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి,కుర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు,కుంకుమ,పూలు,అక్షంతలు దేవిపై చల్లవలెను)
లక్ష్మీదేవికి పాద్యం
సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
(శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లు భావించి నీళ్ళు వరలక్మీదేవిపై చల్లి,రెండు చుక్కల నీళ్ళు వేరొక పాత్ర లోనికి వదలవలెను.)
లక్ష్మీదేవికి అర్ఘ్యం
శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం,అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
(శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి.అని చేతులు కడుగుకొనుటకుకూడా నీరు ఇచ్చు చున్నట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి,రెండు చుక్కల నీళ్ళు వేరొక పాత్ర లోనికి వదలవలెను.)
లక్ష్మీదేవికి ఆచమనీయం
సువర్ణ కలశానీతం చందనాగరు సమ్యుతం,గృహాణచమనందేవిమయాదత్తం శుభప్రదే
(వరలక్ష్నీదేవతాం ఆచమనీయం సమర్పయామి.అని దేవిముఖమును శుభ్రం చేసుకొనుటకు నీరు ఇచ్చునట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి,రెండు చుక్కల నీళ్ళు వేరొక పాత్ర లోనికి వదలవలెను.)
లక్ష్మీదేవికి పంచామృత స్నానం
పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం,పంచామృతస్నాన మిదం గృహాణ కమలాలయే
(శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృతస్నానం సమర్పయామి. అని స్నానమునకు పంచామౄతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి,ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామౄతమును దేవిపై ఆకు లేదా పువ్వుతో చల్లవలెను)
లక్ష్మీదేవికి శుద్ధోదకస్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం,శుద్దోదకమిదంస్నానం గృహాణవిధుసోదరీ
(శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదకస్నానం సమర్పయామి.అని పంచపాత్రలోని శుద్ధమైన నీటినిపువ్వుతో దేవిపై చల్లవలెను)
లక్ష్మీదేవికి వస్త్ర యుగ్మం
సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసనప్రియే,వస్త్ర్యుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
(శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి.పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.)
లక్ష్మీదేవికి ఆభరణములు
కేయూరకంకణా దేవీ హారనూపుర మేఖలాః విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి.బంగారముకాని,వెండికాని,మీరు కొనుక్కున్న కొత్త నగలు లేదా లక్ష్మీ కాసు(రూపు) దేవికి సమర్పించుకోవాలి(లేకున్నచో అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి)
లక్ష్మీదేవికి ఉపవీతం
తప్త హేమకృతం దేవీ మాంగల్యం మంగళప్రదం,మయాసమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి.అని పత్తిని 3లేదా 4 అంగుళములు పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యగ్నోపవీతమునుదేవికి సమర్పించుకోవాలి)
లక్ష్మీదేవికి గంధం
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్,హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
(శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి.అని అక్షంతలు (పసుపుకలిపిన బియ్యమును)దేవిపై చల్లవలెను.)
లక్ష్మీదేవికి పుష్పపూజ
::- మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకుళైస్తధా,నీలోత్పలైఃశ్చలళారైఃపూజయామి హరిప్రియే
(శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి.అని అన్నిరకములపూవులతో దేవిని పూజించవలెను.)
అధాంగపూజ:
కుడిచేతిలోనికి అక్షంతలు తీసుకొనిక్రిందనామములను చదువుతూ అక్షతలను దేవిపైచల్లవలెను.పసుపు,లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును.
- చంచలాయై నమః -- పాదౌ పూజయామి
- చపలాయై నమః -- జానునీ పూజయామి
- పీతాంబరాయై నమః -- ఊరూం పూజయామి
- కమలవాసిన్యైనమః -- కటిం పూజయామి
- పద్మాలయాయైనమః -- నాభిం పూజయామి
- మదనమాత్రే నమః -- స్తనౌ పూజయామి
- కంబుకంఠ్యై నమః -- కంఠం పూజయామి
- సుముఖాయై నమః -- ముఖం పూజయామి
- లలితాయైనమః -- భుజద్వయం పూజయామి
- శ్రియైనమః --ఓస్ఠౌ పూజయామి
- సునాసికాయైనమః -- నాసికాః పూజయామి
- సునేత్రాయై నమః -- నేత్రౌ పూజయామి
- రమాయైనమః -- కర్ణౌ పూజయామి
- కమలాయైనమః -- శిరః పూజయామి
- శ్రీవరలక్ష్మై నమః -- సర్వాణ్యంగాని పూజయామి
Sri Maha Ganadhipatiye Namah
Aachamanam
(hold spoon with your left hand and add water into your right hand to wash) Now add water into your right hand thrice to drink and for each time spell these 3 names Om Keshavaya swaahaa , Om Narayanaya swaahaa, Om Madhavaya swaahaa Om Govindaya namaha (again wash your right hand)
- Om Vishnave namaha
- Om Madhusudanaya namaha
- Om Trivikramaya namaha
- Om Vamanaya namaha
- Om Sridharaya namaha
- Om Hrushikeshaya namaha
- Om Padmanabhaya namaha
- Om Samkarshanaya namaha
- Om Vasudevaya namaha
- Om Pradyumnaya namaha
- Om Aniruddhaya namaha
- Om Purushottamaya namaha
- Om Adhokshajaya namaha
- Om Naarasimhaya namaha
- Om Achyutaya namaha
- Om Janardhanaya namaha
- Om Upendraya namaha
- Om Haaraye namaha
- Om Srikrishnaya namaha
Suklaam Baradharam vishnum sasi varnam chatur bhujam prasanna vadhanam dhyaye sarva vignopa saanthaye
Lakshmi Sthotram
Lakshmi Ksheera Samudra Raaja Tanaya Sree Ranga Dhaameshvari
Daasi Bhootha Samasata Deva Vanithaam Lokaika Deepankuram
Sreeman Manda Kataaksha Labdha Vibhava Brahmendra Gangaadharam
Tvaam Trailokya Kudumbineem Sarasijam Vande Mukunda Priyaam
No comments:
Post a Comment