!! పూజకు కావలసిన వస్తువులు !!
- దీపారాధన చేయుటకు కుంది(ప్రమిద) వెండిదిగాని,ఇత్తడిగాని,మట్టిదిగాని,వాడవచ్చును.
- దీపారాధనకు పత్తితో చేసిన వత్తులు, అగ్గిపెట్టె,ఆవునెయ్యి(నువ్వులనూనెగాని, కొబ్బరనూనెగాని వాడవచ్చును).
- ధూపమునకు సాంబ్రాణీ, అగరుబత్తిలు
- పసుపు,కుంకుమ, గంధం,హారతి కర్పూరము.
- పూల మాల , విడి పువ్వులు, అక్షతలు(పసుపుతోకలిపినవి కొద్దిగా)
- పండ్లు,కొబ్బరికాయలు, తమలపాకులు,వక్కలు
- బంగారపు లక్ష్మీ దేవి రూపు (లేదా పసుపు కొమ్ము), తోరములు (దారమును 9 వరసలుగాతీసి పసుపురాసి సిద్దముగా వుంచుకొనవలెను.)
- శక్తీ కొలది వెండి , బంగారం,ఇత్తడి, రాగితో చేసినచెంబు కల్సరాధన కి
- పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని,చిన్న పంచపాత్రగాని తీసుకొని దానిలో శుధజలము పోసి,ఆ చెంబునకు కలశరాధనచేసి ఆ నీళ్ళు మాత్రమే దేవునిపూజకు ఉపయోగించవలెను
- ఆవు పాలు,ఆవు నెయ్యి,ఆవు పెరుగు,పంచదార మరియు తేనె(పంచామృతం కొరకు)
- నానపెట్టిన సెనగలు
- నివేదనకు చలిమిడి(బియ్యంపిండి,బెల్లం కలిపి తడిపి ముద్దగా చెయ్యాలి)
- పానకం,(శుధమైన నీటిలో బెల్లంపొడి,ఏలక్కాయపొడి,మిరియాలపొడి కొద్దిగా కలుపుతారు)
- మహా నైవేద్యం కొరకు, పంచ భక్ష్యములతో కూడిన భోజనము, 9 రకాల పిండివంటలను తయారుచేసి,నైవెద్యం గా పెట్టవలెను.
గడప పూజ
ఇంటి గడప లేదా గుమ్మం ని లక్ష్మీ దేవిగా భావిస్తాము అందుకే కొంత మంది పెద్ద వాళ్ళు గడప పైన నిల్చుంటే ఊరుకోరు.మన ఈ నాటి పూజ వరలక్ష్మీ దేవికి కాబట్టి గడపని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి మామిడి తోరణాల తోను, పువ్వల మాల ల తోను అలంకరించి లక్ష్మి దేవి కి ఆహ్వానం పలుకుదము.
పూజా స్థానం అలంకరణ
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుభ్రం చేసి బియ్యంపిండితో గాని ముగ్గుపిండితో గాని ముగ్గులుపెట్టి,దైవస్తాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగా గాని,మరీ పల్లముగా గాని వుండకూడదు.ఆపీటకుకూడ చక్కగా పసుపురాసి,కుంకుమబొట్టు పెట్టి పసుపుతో గాని,బియ్యంపిండితో గాని ముగ్గువేయాలి.పద్మాలు(కమలాలు) వచ్చేటట్లు ముగ్గుపెడితే మరీ మంచిది.పూజ చేసే వారు తూర్పుముఖంగా కూర్చోవాలి.
అదే విధంగా పాలవెల్లి ని కూడా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి, పూజాస్థానం కి పైన వోచ్చేట్లుగా కట్టండి. పాలవెల్లి పైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఆకులతో,పువ్వులతో అలంకరించండి . అవి అన్ని దొరకనప్పుడు మామిడి ఆకులతో అలంకరించండి.
పూజా స్థలాన్ని అరటి ఆకులతోను,పువ్వుల తోను వీలయితే తామర పుష్పాలతోను. మీ శక్తీ కి తగ్గినట్లుగా వీలైనంత అందముగా అలంకరించండి
ముందు పసుపుతో గణపతిని తయారుచేసి(పసుపును సుమారు అంగుళంసైజులో త్రికోణ ఆకౄతిలో ముద్దగాచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెములో గాని,కొత్త తుండుగుడ్డపై గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతిని ఉంచాలి.
తరువాత(Next)Required things to perform pooja
- Candle(Dheepam )-A saucer for oil, used as a lamp called.( It can be made off with Silver, Brass, bronze, Gold or Clay)
- Candle-Wicks made off with cotton
- Matchsticks/Lighter to lit the candle/ Dheepam
- Pure Cow ghee/ Seasame seed oil/ Coconut oil
- Incense Sticks
- Turmeric powder
- Kumkum powder
- Sandal wood powder
- Camphor cubes(for Aarati).
- Flower garland
- Flowers
- Rice mixed with Turmeric paste(Akshatan)
- Possible varieties of Fruits & Coconuts
- Betel leaves and Supari
- Golden Lakshmi Pendent (orTurmeric Stick)
- THORAM-(Around 50cm length (tie to wrist ) a thread with Nine rows by applying turmeric paste)
- A pot made off with Silver, Brass, bronze, Gold to arrange KALASAM
- Keep some pure water aside for KALASA Pooja
- Cow Ghee,Cow Milk,Cow Yogurt,Honey and Sugar to make Panchaamrutam
- Soaked Chick Peas
- Prasad (Chalimidi)-Preparation Take 100gm Rice flour & 50gm Jaggery add water and make a dough ball.
- PAANAKAM-Traditional Indian Drink-(Preparation Take 2 spoons of Jaggery powder , Pinch of Green Cardmam powder and a pinch of Pepper powder ,add all these Ingredients in a a glass of water and mix)
- NAIVEDYAM(specially prepared food offered to goddess)- Prepare 9 varieties of food and keep it ready.
Adore Your Door Step
Door step is considered as Goddess in Indian tradition. This is the reason behind why our elders don’t allow us standing over the Door step. Today’s festival is related to goddess Lakshmi so
- Wash your door step apply turmeric paste and put kumkum .
- Make a RONGOLI in front of your door step.
- We will decorate our door step with THORANAM (a thread lined up with Mango leaves/Betel leaves and with garlands) to Welcome our goddess Lakshmi into our house.
Decorate Adoring place (Pooja Sthaan)
Suitable place for arranging pooja is Northeast corner of the house (or room). If not possible arrange East side of the room and you (Adorer) should sit facing towards East. Clean the area with water and make a RONGOLI with rice flour,turmeric powder ,kumkum and flowers. On top of it place a wooden stool (this should not be too high or too low) decorate that as well with RANGOLI.
Decorate PALAVELLI wash and apply turmeric paste, kumkum and hang it on top of Goddess. Decorate some Mango leaves and flowers.
Decorate Pooja Sthaan with Bana leaves, Mango leaves and flower garlands in your possible best way. If you are able to manage to get LOTUS flowers that would be superb.
- First Prepare Lord Ganesh with turmeric paste- it is about 1inch size in triangle shape . Decorate with kumkum .
- Take a plate or a new cloth pour some rice and make it as flatbed.
- Place a Betel leaf on top of rice bed-to place Lord Ganesha
No comments:
Post a Comment